Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది భామలు తమదైన ముద్ర వేశారు. అందులో కొందరు సక్సెస్ లను అందుకోగా.. మరొకందరు తెరమరుగయ్యారు. తెరమరుగైన వారిలో సమీరా రెడ్డి ఒకరు. టాలీవుడ్ లో ఫెయిల్యూర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె. ఇతర భాషల్లో మాత్రం తనదైన సత్తా చాటింది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ను మాత్రం సోషల్ మీడియా ద్వారా పలకరిస్తుంది. రీసెంట్ గా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఆసక్తికరమైనవి, సంచలన విషయాలను వెళ్లడించారు.
అలా వచ్చిన భామ..
తెలుగు కుటుంబంలోనే సమీరా రెడ్డి జన్మించింది. చిన్న వయస్సు నుంచే మోడలింగ్ కు ఆకర్షితురాలై కెరీర్ మొదలు పెట్టింది. ‘మైనే దిల్ తుజ్‌కో దియా’తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా వరకు సినిమాలు చేసింది.
టాలీవుడ్ డిజాస్టర్లతోనే..
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘నరసింహుడు’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సమీరారెడ్డి. ఎన్నో అంచనాలతో రిలీజైనా భారీ డిజాస్టర్ వైపు మళ్లింది. ఇక, దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘జై చిరంజీవ’లో నటించగా అది కూడా నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మళ్లీ యంగ్ టైగర్ తో ‘అశోక్’ చేసినా అది కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
కలిసి రాదనుకొని..
టాలీవుడ్ లో వరుస పరాజయాలను చవి చూసిన సమీరా రెడ్డి టాలీవుడ్ ను మెల్ల మెల్లగా వీడడం ప్రారంభించింది. టాలీవుడ్ లో ఆమెకు డిజాస్టర్లు, ఫ్లాపులు ఉన్నా.. మిగతా ఇండస్ట్రీలలో మాత్రం రాణిస్తూనే ఉంది. 2014లో అక్షయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ సమయంలో మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగినా అది జరగలేదు. వెంట వెంటనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఈ ఫ్యామిలీతోనే గడుపుతోంది.
దాన్ని అలాగే కవర్ చేసేదాన్ని
‘నా బ్రెస్ట్ సర్జరీ గురించి చాలా మంది చెప్పడంతో ఆలోచనలో పడ్డాను. ఒక దశలో సర్జరీ వరకూ వెళ్లి ఎందుకులే అని ఆపేశా. పెద్దగా కనిపించేందుకు ప్యాడ్స్ వాడేదాన్ని. ‘సర్జరీ చేయించుకొని ఉండుంటే ఇంత సుఖంగా ఉండకపోయేదాన్నని తెలుసు. ఇప్పుడు సర్జీలు వద్దని చెప్పడం లేదు. అది సంతోషాన్ని కలిగిస్తే నేను తప్పుపట్టను. ఎవరి ఇష్టం వారిది. అందుకే ఈ విషయంలో నేను సలహాలు ఇవ్వలేను’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది.