Home POLITICS ANDHRA PRADESH Atchannaidu : నాలుగేళ్ల ముందు ఇదే రోజు అరెస్టయిన అచ్చెన్నాయుడు..

Atchannaidu : నాలుగేళ్ల ముందు ఇదే రోజు అరెస్టయిన అచ్చెన్నాయుడు..

171
Atchannaidu
Atchannaidu

Atchannaidu : చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడు సోదరుడు కింజారపు అచ్చెన్నాయుడు చంద్రబాబుకు విధేయుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతొ  చంద్రబాబు కేబినెట్‌లో కీలక సభ్యుల్లో ఒకరిగా మారారు. నేడు (జూన్ 12) ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో గత ప్రభుత్వం ఆయనపై మోపిన తప్పుడు కేసులను టీడీపీ మద్దతుదారులు గుర్తు చేసుకుంటున్నారు.

అచ్చెన్నాయుడు 2014 నుంచి టెక్కలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ 2020, అక్టోబర్ నుంచి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2020లో ఇదే రోజున గత ప్రభుత్వం మోపిన తప్పుడు కేసులో అరెస్టయ్యాడు. 2014-2019 మధ్య మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయ్యారు.

అయితే, ఈ కేసులో ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. సాక్షాలను కోర్టు ఎదుట హాజరుపరచడంలో పోలీసులు, గత ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. 2021లో కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ నేతను బెదిరించిందని ఆరోపిస్తూ మరో తప్పుడు కేసుతో ఆయనను ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. తామరాకుపై నీటి బొట్టులా ఎలాంటి అవకతవకలకు తాను పాల్పడలేదని అందుకే కోర్టుకు సాక్షాలను తేవడంలో గత ప్రభుత్వం విఫలమైందని అచ్చెన్నాయుడు అన్నారు.

ఈ రోజు అచ్చెన్నాయుడు అన్ని ఇబ్బందులను అధిగమించి మంత్రి అయ్యారు. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో కీలక శాఖ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. తాను నిజాయితీపరుడినని, నేడు ప్రజలు తన వెంటే ఉన్నారని నిరూపించుకునేందుకు ఓపికగా ఎదిరిచూశారు అచ్చెన్నాయుడు.

ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడును కేంద్ర మంత్రిగా, ఎర్రన్నాయుడు అల్లుడు ఆదిరెడ్డి వాసును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా చంద్రబాబు నియమించడం ఆసక్తికరంగా మారింది.