Pune : దారుణ ప్రమాదం.. ఏకంగా 25 మంది సజీవదహనం అయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది . ఈ ఘోర ప్రమాదం ఎంతో భయాన్ని సృష్టించింది.. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వే పై మా లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే 32 మంది ప్రయాణికులతో పుణెకు వెళ్తుండగా శనివారం ఉదయం 2. గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. టైర్ పేలి ఢమ ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన వారిని బుల్గానా ప్రభుత్వ దవాఖాన తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు.అయితే ఈ విషాదకర ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని బుల్దానా ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించడానికే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రమాదం పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ ఆలోచనంతా వారి కుటుంబాల గురించేనని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. పలువురు ప్రముఖులు ఈ ఘటన పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
|
ReplyForward
|






