33.4 C
India
Wednesday, May 21, 2025
More

    ICC Titles : ఐసీసీ టైటిల్స్ లో అగ్రస్థానం ఆస్ట్రేలియాదే..!

    Date:

    ICC Titles
    ICC Titles

    ICC Titles : క్రికెట్ లో అన్నింటా ఆధిపత్యం కనబరుస్తూ ఉంటే ఆస్ట్రేలియానే ఐసీసీ టోర్నమెంట్లలో ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో టైటిళ్లు గెలుచుకుని అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించిన వన్డే వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ లు గెలిచిన ఏకైక జట్టుగా  ఆస్ట్రేలియా నిలిచింది.

    ఐసీసీ టోర్నమెంట్లలో వన్డే వరల్డ్ కప్ ల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు వన్డే వరల్డ్ కప్, ఒక సారి టెస్ట్ ఛాంపియన్ షిప్, ఒక సారి టీ 20 వరల్డ్ కప్, రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫి నెగ్గిన ఆస్ట్రేలియా మిగతా జట్ల కంటే అన్నింటిలో ముందుంజలో ఉంది. క్రికెట్ లో అన్ని జట్లపై ఆధిపత్యం ప్రదర్శించగల ఆస్ట్రేలియా ఏ దేశంలో ఆడినా.. ఎలాంటి పిచ్ పైనా అయినా సరే తమ ఆధిక్యమే ఉండేలా ప్రపంచ క్రికెట్ చరిత్రలో సుదీర్ఘమైన విజయాల రికార్డులతో తమ కంటూ ప్రత్యేక చరిత్ర లిఖించుకుంది.

    ఐసీసీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో విజయాలు సాధించగా.. టీం ఇండియా రెండో స్థానంలో కొనసాగుతుంది. భారత్ రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ నెగ్గగా.. టీ 20 వరల్డ్ కప్ రెండు సార్లు, చాంపియన్స్ ట్రోపీ రెండు సార్లు నెగ్గింది. కాగా రెండు సార్లు టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకున్న టీం ఇండియా మాత్రం చివరి మెట్టుపై బోల్తా పడింది. ఒక సారి ఆస్ట్రేలియాపై, మరో సారి న్యూజిలాండ్ పై ఓడిపోయి టెస్ట్ ఛాంపియన్ షిప్ ను కోల్పోయింది. భారత్ కు టెస్ట్ ఛాంపియన్ షిప్ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది.

    ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్న టాప్ 10 దేశాల్లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. అఫ్గాన్ ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలెట్టింది. కాగా దక్షిణాఫ్రికా ఒక సారి ఛాంపియన్స్ ట్రోపీ, విండీస్ రెండు సార్లు వన్డే వరల్డ్ కప్, రెండు సార్లు టీ 20 ప్రపంచ కప్ నెగ్గాయి. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఐసీసీ ట్రోపీలు గెలుచుకున్న జాబితాలో ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Border-Gavaskar Trophy : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు వీరే..

    Border-Gavaskar Trophy : భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్...

    Boy Turned Girl : అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు

    Boy Turned Girl : టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్...

    Arshadeep : అర్షదీప్, హర్దిక్ లకు గోల్డెన్ చాన్స్.. ఎలాంటి చాన్స్ వచ్చిందంటే?

    Arshadeep : సౌతాఫ్రికాతో నాలుగు టీ 20 మ్యాచుల క్రికెట్  సిరీస్...

    Team India lowest scores : టీమిండియా మూడు ఫార్మాట్లలో అత్యల్ప స్కోరు ఇవే

    Team India lowest scores : టీమిండియా న్యూజిలాండ్ తో రెండో...