
NRI donates : పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీని పవర్ లోకి తెచ్చేందుకు అధినేత పవన్ కళ్యాన్ తెగ కష్టపడుతున్నాడు. ఇటీవల ఆయన పొత్తులు ఉంటాయని అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉంటుందని తెలిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపారు. ఆయన పొత్తుల అంశంపై ఇప్పటికే ఏపీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఏఏ పార్టీతో పొత్తు ఉంటుందన్నది ఊహాగానాలు మాత్రమే కొనసాగుతున్నా.. అధికారికంగా ప్రకటన మాత్రం చేయడం లేదు.
జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుడా ఏకపక్షంగా తన ఖాతాలో వేసుకోవచ్చని చూస్తున్నారు పవన్ కళ్యాన్. అయితే తనకు ఇప్పుడే సీఎం కావాలనే ఆకాంక్షమాత్రం లేదని బాహాటంగానే చెప్పారు ఆయన. జనసేన-టీడీపీతో పొత్తు ఉంటుందని ఓపెన్ సీక్రెట్ గానే ఉన్నా.. ఇప్పుడు సీపీఐ కూడా కలిసి వస్తామని అంటుంది. సీపీఐ పార్టీ నేత రామకృష్ణ మాట్లాడుతూ జనసేన, టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.అయితే మరి బీజేపీ పరిస్థితి ఏంటని ఇప్పుడు రాష్ట్రంలో చర్చ బయల్దేరింది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరూ బీజేపీతో కలిసి నడుస్తున్నాడు. టీడీపీని కూడా కలుపుకోవాలి బీజేపీ అధిష్టానానికి సూచించినా వారు ఆయన మాటలను ఖాతరు చేయలేదు. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ మొగ్గు చూపిస్తున్నా.. సీపీఐ మాత్రం బీజేపీని దూరంగా ఉంచాలని చెప్తూ వస్తోంది.

పనవ్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఆస్ట్రేలియా నుంచి ఎస్ఆర్ఐలు విరాళం అందజేశారు. ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ఆస్ట్రేలియాలో సేకరించిన రూ. కోటి విలువైన చెక్కును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు గురువారం (మే 18)న అందజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ సమన్వయ కర్తలు రాజేశ్ మల్లా, శశిధర్ కొలికొండ, జనసేన నాయకులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగదీష్ హరిదాస్, జ్ఞానేశ్వర్ రావు పప్పుల, చందు గల్లా ఉన్నారు.