Free Auto :
ఇప్పుడు మనం సిటీల్లో ఎటువెళ్లాలన్నా ఆటోలు, క్యాబ్ లు బుక్ చేసుకోవడం కామన్. అయితే దూరాన్ని బట్టి చెల్లిస్తేనే వీటిలో ప్రయాణించగలం. అయితే ఇక్కడ ఫ్రీగానే ప్రయాణించవచ్చు. ఆటో ప్రయాణం వల్ల సమయానికి మనం వెళ్లాలనుకున్న ప్లేస్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్లు, పిల్లలు, గర్భిణులు,దివ్యాంగులు తమ ప్రయాణంలో ఆటోలనే ఎక్కువగా వాడుకుంటారు.
అయితే వీరికోసమే ఏపీలోని గ్రేటర్ విశాఖ పట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉచిత ఆటో ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. అయితే విశాఖలో కోస్టల్ బ్యాటరీ నుంచి సాగర్ వరకు ఈ ప్రయాణం ఉచితం. కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్కే బీచ్ మీదులగా పార్క్ హోటల్ జంక్షన్, లాసన్స్ బే కాలనీ, తెన్నేటీ పార్కు, జోడుగుళ్ల పాలెం నుంచి సాగర్ వరకు నిత్యం ఈ ఎలక్ర్టిక్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి. బీచ్ రోడ్డులో పర్యటించే వారికోసం ఈ ఉచిత ఈ ఆటోలను గ్రేటర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రారంభించింది. వృద్ధుల, పిల్లలు, గర్భిణులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. దివ్యాంగులకు కూడా వర్తిస్తుంది.
పర్యాటక ప్రాంతాల్లో ఈ వాహనాలను ప్రోత్సహించడం లో భాగంగా వీటిని ప్రవేశపెట్టారు. వీటిని నడుపుతున్న డ్రైవర్లకు రూ. 15 వేల వేతనం ఇస్తున్నారు. ఈ ఆటోలు బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి. సేవా భావంతో పని చేసే డ్రైవర్లను వీటికి నియమించింది. వాహన కాలుష్య నివారణకు ఈ ఆటోలు దోహదం చేస్తాయని వారు చెబుతున్నారు. అయితే ఈ వాహనాల కదలికలు తెలుసుకునేందుకు జియో ట్యాగింగ్ చేశారు. ఉదయం నుంచి 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇవి నడిపిస్తారు. ఒక్కో ట్రిప్పులో ముగ్గురిని మాత్రమే తీసుకెళ్తారు. పూర్తి ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వీటిని నడుపుతారు. అయితే వీటికి సంబంధించిన ఆర్థిక అవసరాలను అసియా అభివృద్ధి బ్యాంక్ అర్బన్ క్లైమాట్ చే్జ్ రెసిలెన్స్ ట్రస్ట్ ఫండ్ కింద సమకూరుస్తున్నది.