
అవతార్ ది వే ఆఫ్ వాటర్ ( అవతార్ 2 ) ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. దాంతో విపరీతమైన పోటీ ఏర్పడింది ఈ చిత్రాన్ని చూడటం కోసం. అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ చిత్రం. ఇక ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ట్విట్టర్ లో తమ రివ్యూలను ఇచ్చేస్తున్నారు. ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం అవతార్ 2 ఎలా ఉందో తెలుసా …… బొమ్మ బ్లాక్ బస్టర్.
విజువల్ వండర్ …… ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి……. సింపుల్ గా చెప్పాలంటే అవతార్ 2 ను థియేటర్ లలోనే చూడాలి ……. దాన్ని ఆస్వాదించాలి అంతే ! అని అంటున్నారు నెటిజన్లు. అంటే సెకండ్ థాట్ లేకుండా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నమాట. అంటే ప్రపంచ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్ర ఈ సినిమా సృష్టించబోతోంది అని అర్థమౌతోంది.
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ కు ఇది సీక్వెల్. 2009 లో వచ్చిన అవతార్ యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. కట్ చేస్తే 13 సంవత్సరాల తర్వాత వచ్చిన అవతార్ 2 అన్ని అంచనాలను బద్దలు కొడుతూ సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తమ రివ్యూ లను సూపర్ అంటూ ఇవ్వగా తాజాగా ప్రేక్షకులు కూడా బ్లాక్ బస్టర్ అంటున్నారు. దాంతో ఊహించని రికార్డులు అవతార్ 2 వశం కాబోతున్నాని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.