- ఏబీఎన్ ప్రతినిధిపై దాడి

Avinash followers : ఏపీలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీరు సంచలనంగా మారుతున్నది. సీబీఐ పిలిచినా విచారణకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతున్నది. ఇప్పటికే హత్య అంశం సీఎం వైఎస్ జగన్ కు తలనొప్పిలా మారింది. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న సీబీఐ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే సీబీఐ బృందాలు కడపకు బయల్దేరినట్లు సమాచారం. సీబీఐ అధికారులు ఫోన్ చేసినా స్పందించడంల లేదని తెలిసింది. అవినాష్ ను సీబీఐ బృందాలు వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా వైఎస్ అవినాష రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. పెద్ద సంఖ్యలో అనుచరులు అవినాశ్ వెంట ఉన్నారు. ఆయనను వెంట వెళ్తూ కవరేజ్ కు వెళ్లిన ఏబీఎన్ ప్రతినిధిని తీవ్రంగా కొట్టారు. లైవ్ కవరేజ్ ఇస్తున్న మీడియా ప్రతినిధి పై దాడి చేశారు. రిపోర్టర్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరో మీడియా ప్రతినిధిపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. అయితే గాయపడిన రిపోర్టర్ను దవాఖానకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా స్పందించాయి,. మరోవైపు మీడియా పై దాడి ప్రజాస్వామ్యం దాడిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై అభివర్ణించారు. వివిధ పార్టీల నాయకులు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యయుత దేశంలో ఇవి సరికావని చెబుతున్నారు.
అయితే ఆది నుంచి వైసీపీ నాయకుల తీరు ఇలాగే ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వారికి న్యాయవ్యవస్థ, మీడియా, రాజకీయ నేతలు ఇలా ఎవరన్న లెక్కలేదని, భౌతిక దాడికి దిగడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు తనపై దాడిచేసిన కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నారు.