- విచారణకు రాలేనన్న కడప ఎంపీ

కడపలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని శుక్రవారం సీబీఐ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఆయన హాజరు కాకపోవడం వరుసగా ఇది రెండో సారి. వ్యక్తిగత కారణాలతో రావట్లేదని ఆయన గతంలో సమాచారం ఇచ్చారు. తాజాగా శుక్రవారం విచారణకు రావాలని సీబీఐ నోటీసులు పంపగా, తల్లి అనారోగ్యం కారణంగా హాజరు కావట్లేదని చెబుతున్నారు.
వివేకా హత్య కేసులో కీలకంగా వినిపించిన వారందరినీ సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ కేసు దర్యాప్తులో వేగం పెంచింది. అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అవినాష్ ను కూడా ఇప్పటికే ఏడు సార్లు విచారించింది.
అయితే అవినాష్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మరోసారి విచారణకు డుమ్మాకొట్టడం సీబీఐ సీరియస్ గా తీసుకుంది. ఏదో కారణం చెబుతూ విచారణకు డుమ్మా అవుతుండడం సీబీఐ కీలకంగా తీసుకుంది. అయితే తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్ పులివెందులకు తెలుస్తున్నది. అయితే అవినాశ్ విన్నపాన్ని సీబీఐ తిరస్కరించింది, హుటాహుటిన సీబీఐ బృందాలు పులివెందుల బయలుదేరి వెళ్లాయి. సీబీఐ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక అవినాష్ ను బలవంతంగా అదుపులోకి తీసుకుంటుందా అనే చర్చ కూడా కొనసాగుతున్నది. ఏదేమైనా సాయంత్రాని కల్లా సీబీఐ తీసుకునే చర్యలపైనే టాక్ నడుస్తున్నది. అవినాష్ అరెస్ట్ ఖాయమనే నేపథ్యంలో పులివెందులలో పోలీస్ భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.