Avneet Kaur : మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అవ్నీత్ కౌర్ డ్యాన్సర్ గా గుర్తింపు సంపాదించుకొని మెల్ల మెల్గా నటిగా ఎదిగింది. 2014లో విడుదలైన ‘మర్దానీ’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అనేక టీవీ షోస్ లో సీరియల్స్ లలో కనిపించింది. డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ , ఝలక్ దిక్ లాజా 5, మర్దానీ, చంద్ర నందిని, అలాద్దీన్ – నామ్ తో సునా హోగా, టికు వెడ్స్ షేరు లాంటివి ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
అవ్నీత్ కౌర్ 13, అక్టోబర్ 2001న పంజాబ్‌లోని జలంధర్‌లో సిక్కు మతానికి చెందిన సోనియా నంద్రా-అమన్‌దీప్ సింగ్ నంద్రాకు జన్మించింది. జలంధర్ నుంచి వారి కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఆమె తన ఏనిమిదేళ్ల వయస్సులో నటనను ప్రారంభించింది. కౌర్ ముంబైలోని కండివాలిలోని ప్రైవేట్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ చేశారు.
జీ టీవీలో 2010లో డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ తో టీవీల్లో కనిపించడం మొదలు పెట్టింది. కానీ సెమీ ఫైనల్ ముందే కౌర్ ఎలిమినేట్ అయ్యింది. స్టార్ యాజమాన్యంలోని లైఫ్ ఒకే ఛానల్ లో మేరి మాలో బుల్లితెరపై అడుగుపెట్టింది. ఇలా ఆమె ప్రయాణం సినిమాల వరకు వెళ్లింది.
ప్రస్తుతం మంచి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కౌర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను అలరిస్తోంది. అప్పుడప్పుడు తన పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఇందులో భాగంగా రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. సంప్రదాయ దుస్తులైన చీరలో కనిపించి మురిపించింది.