Rajasthani Organization : ‘రాజస్థాని ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ రెసిడెంట్స్’ ఆధ్వర్యంలో అవేర్ నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అమెరికాలోని ఇండియన్స్ కోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమెరికాలో లభించే వసతుల నుంచి చదువుల వరకు అవేర్‌నెస్ షెషన్ ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా అమెరికా వచ్చిన వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇండియన్స్ కు ఈ అవేర్ నెస్ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతున్నాయి.
ఈ అవేర్ నెస్ ప్రోగ్రాంలో కాలేజీలో అడ్మిషన్ పొందడం ఎలా? ఎస్ఐ రైటింగ్ టిప్స్, ఆశయాలను సాధించుకోవడం ఎలా? గుర్తుంచుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు. ఇంకా అనేక విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీన సాయంత్రం 8.30 గంటలకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తరుణ రమణి, టెడ్ ఎక్స్ స్పీకర్ కోచ్, పబ్లిక్ స్పీకింగ్ కోచ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఆర్గనైజేషన్ లోని సభ్యులకు ప్రవేశం ఉచితం.
మరిన్ని విషయాలకు Tarang Soni@732-306-1003లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు.