వస్తూ పోతుండే వాళ్లను చూసి
వీధినిపడ్డ పిచ్చి కుక్కలు మొరుగుతూంటాయి…
మనకు తెలిసిందే.
ఏనుగులు వెళుతూంటే
వీధిలో ఉన్న కుక్కలు మొరుగుతాయి…
మనకు తెలిసిందే.
మరికొన్ని సందర్భాల్లోనూ
వీధిలోని పిచ్చి కుక్కలు
సంబంధం లేకపోయినా,
అవసరం లేకపోయినా
మొరుగుతాయి;
మొరుగుతూంటాయి…
ఇపుడు ఇక్కడ
గుడిని చూసి కుక్కలు మొరుగుతున్నాయి!
మన దేశంలో
అయోధ్య రాముడి గుడిని చూసి
కుక్కలు మొరుగుతున్నాయి…
ప్రపంచంలో ఎక్కడా, ఎప్పుడూ
మసీదుల్ని, చర్చ్‌ల్ని చూసి
కుక్కలు మొరగలేదు
కానీ మన దేశంలో ఇవాళ
గుడిని చూసి కుక్కలు మొరుగుతున్నాయి…
ఇలా గుడిని చూసి కుక్కలు మొరగడం
వైద్యంలేని మానసిక రోగం;
ఎక్కడా, ఎప్పుడూ జరగని
చారిత్రిక వికారం.
మన దేశంలో ఇవాళ
గుడిని చూసి కుక్కలు మొరిగిన వైనాన్ని
ప్రపంచం వికృతంగా చెప్పుకుంటుంది;
చరిత్ర ఈ కుక్కల్ని అసహ్యించుకుంటుంది.
“ఉరిమి మొరుగు కుక్క యోగినే మెరుగురా?”
అని అన్నాడు మన వేమన గతంలో;
‘గుడైనా, బడైనా పిచ్చి కుక్కలు మొరుగుతాయి’
అన్న సత్యాన్ని మనం చూస్తున్నాం వర్తమానంలో.
ఊర కుక్కలు
ఉన్మాదంతో మొరుగుతాయి కానీ
విజ్ఞతతో మొరుగుతాయా?
మనో వికాసం లేకపోవడం కాదు
మతి పగిలిపోయాక
సభ్యత, సవ్యత ఉండవు కదా?
తట్టుకోలేని స్థితి వస్తే
ఉన్మాదానికి ఉరెయ్యాల్సిందే;
కరిచేందుకు వచ్చే
కుక్కల్ని కాలరాచెయ్యాల్సిందే;
మట్టికి హాని చేసే వాటిని
వదలకుండా మట్టు పెట్టెయ్యాల్సిందే.
గుడి మన సంస్కృతికి నుడి;
గుడి మన సంప్రదాయానికి మున్నుడి.
మన నుడిని మనం పలకాలి;
మన సవ్వడిని ప్రపంచం చదవాలి.
గుడిని చూసి మొరిగే కుక్కలు కుళ్లిపోతాయి;
రేపటికి అవి కృశించి నశించి పోతాయి.
గుడి నిలిచి ఉంటుంది;
గుడి ఒక వైభవంలా నిలబడి ఉంటుంది;
అయోధ్య రాముడి గుడి
మన జన ఘన విజయాన్ని
ప్రపంచానికి చాటుతూనే ఉంటుంది.
– రోచిష్మాన్
9444012279