Rahul Gandhi : కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పనిచేసే వారికి పట్టం కడతారని చెప్పారు. కాంగ్రెస్ లో మహామహులు ఎందరో దేశం కోసం సేవలు చేశారు. అందులో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పనితీరు అందరికి తెలిసిందే. రాహుల్ గాంధీ కూడా బాగానే పనిచేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో స్వార్థపూరిత ఆలోచనలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారని అంటున్నారు.
ప్రధానమంత్రి మోడీ దేశం కోసం పనిచేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అధోగతి పాలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దేశ భవిష్యత్ కాంగ్రెస్ మీదే ఆధారపడి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ లో తిరుగుబాటు ఎగురవేసిన వారిలో ఒకరు. 24 మంది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక వర్గంగా ఏర్పడ్డారు. అందులో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని ప్రతిపక్షాలు ఒక జట్టుగా ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా సమావేశాలు కూడా పెట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీని నిలువరించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు గాను కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏను అధికారంలోకి రానీయకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.