36.5 C
India
Friday, April 10, 2026
More

    మిస్ శెట్టిపై బాహుబలి కామెంట్.. రామ్ చరణ్ కూడా ఏమన్నారంటే..

    Date:

    anushka-prabhas-ram-charan
    anushka-prabhas-ram-charan

    అనుష్క, నవీన్ జంటగా నటించి విడుదలకు సిద్ధం అవుతుంది ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించారు. ఇందులో మిస్ శెట్టిగా చేస్తున్న అనుష్క చెఫ్ పాత్రలో నటించగా, మిస్టర్ పోలిశెట్టిగా నవీన్ స్టాండప్ కమేడియాన్ గా కనిపించనున్నారు. రీసెంట్ గా రీలీజైన ఈ మూవీ టీజర్ భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. దీంతో చిత్రం విజయంపై భారీ అంచనాలు నమోదయ్యాయి. టీజర్ చూసిన బాహుబలి ప్రభాస్, మగధీర రాం చరణ్ స్పందించారు. వారు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

    మిస్ పోశెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రం టీజర్ కు సినీ అభిమానుల నుంచే కాకుండా స్టార్ హీరోల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. వారు కూడా చిత్ర ప్రమోషంలో భాగంగా మారారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ను వారు కూడా తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా షేర్ చేశారు. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ బాగా నచ్చింది. ఇది చూస్తున్నంత సేపు చాలా రీఫ్రెష్ గా ఫీలయ్యా, ఈ మూవీ టీంకు గుడ్ లక్ అంటూ చెప్పుకచ్చారు రాం చరణ్, ఇక ప్రభాస్ కూడా తనతో కలిసి నటించిన అనుష్క ఈ చిత్రంలో మరింత రీఫ్రెష్ గా కనిపిస్తుందని, ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ప్రభాస్ కూడా విష్ చేశాడు. పాన్ ఇండియా స్టార్లు టీజర్ కు హైప్ ఇవ్వడం టీమ్ మొత్తానికి గ్రేట్ అచీవ్ మెంట్ గా నిలిచింది.

    టీజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే బాగా వైరల్ అయ్యింది. అద్భుతంగా ఉందని కొందరు ప్రశంసలు కురిపించారు. హీరోలు అన్నట్లుగానే చాలా మంది సినీ అభిమానులు, నెటిజన్లు చాలా రీఫ్రెష్ గా ఉందని కామెంట్లు పెట్టారు. ఇక అనుష్క విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ‘యూవీ’ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. హీరో, హీరోయిన్లతో పాటు జయసుధ, తులసి, మురళీ శర్మ తదితరులు ఇందులో నటిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ram Charan : రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్: సంచలన అప్డేట్

    Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్...

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Peddi : “పెద్ది” టీజర్‌పై అల్లు శిరీష్ కామెంట్స్: ఫ్యాన్స్ ఆగ్రహం!

    Peddi : రామ్ చరణ్ నటించిన "పెద్ది" టీజర్‌పై అల్లు అర్జున్ సోదరుడు...

    Pawan Kalyan : రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమట!

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ అంటే ఎంతో అభిమానం....