Chandrababu Naidu :
రాజకీయాల్లో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు. దేశ రాజకీయాల్లో తన ముద్రవైన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సఫలమయ్యాడు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించాడు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు వేసిన ఎత్తుగడలు విఫలమయ్యాయి. ఏపీలో జనసేన ను దూరంగా పెట్టడం, బీజేపీ ఎదురించడం రెండూ మైనస్ అయ్యాయి. దీంతో చంద్రబాబు తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాడు.
ఒంటరి పోరుకు సిద్ధం
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశాడు. దీంతో బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు కలిసాడనే ఊహాగానాలు వచ్చాయి. టీడీపీ శ్రేణులు కూడా బీజేపీతో పొత్తు ఉంటేనే మేలని పేర్కొన్నాయి. ఇటు రాష్ర్టంలో జగన్ ను దెబ్బతీయవచ్చని టీడీపీ నాయకులు చంద్రబాబను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం పొత్తు కోసం వెంపర్లాడడం లేదు. ఒంటరి పోరుకైనా సిద్ధమేనంటూ పార్టీ నాయకులకు సంకేతాలు పంపుతున్నారు.
పవన్ కల్యాణ్ బలం తక్కువ
జనసేన కు క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేదు. కేవలం పవన్ కల్యాన్ అభిమానులు మాత్రమే ఉన్నారు. సరైన నాయకులు లేరు. పార్టీకి దిశానిర్దేశం చేసేవారు లేరు. ఆ పార్టీతో మనకు పెద్ద గా ప్రయోజనం ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లు పూర్తి కాబోతున్నాయి. దీంతో ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. కాంగ్రెస్ తో విపక్షాలన్నీ కలిసి రేపటికల్లా ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ బీజేపీకి దగ్గరగా, కాంగ్రెస్ దూరంగా ఉంటున్నారు. ఎన్డీఏ అధికారం కోల్పోతే కాంగ్రెస్ కు తమ అవసరం పడుతుందని చంద్రబాబు ఆలోచన . అందుకు చంద్రబాబు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ పవన్ కల్యాన్ పొత్తుకు ముందుకు వచ్చినా పెద్ద సంఖ్యలో జనసేకు సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధంగా లేడు. రాష్ర్టంలో జగన్ మీద వ్యతిరేకత దృష్ట్యా చంద్రబాబు ఈసారి టీడీపీ తప్పక అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమాగా ఉన్నారు.