
గత కొద్దీ రోజులుగా బీజేపీ తో పొత్తుల కోసం తహ తహలాడుతున్న చంద్రబాబు ఇటీవల రిపబ్లికన్ టీవీ షోలో చంద్రబాబు చుసిన వ్యాఖ్యలఈ నిదర్శనం.. అయితే ఇప్పుడు బిజెపితో పొత్తు కోసం ఉన్నట్టుండి రజనీకాంత్ ను కూడా దించేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని అవకాశం ఉన్న అన్ని అస్త్రాలనూ వాడుతూ.. చంద్రబాబు నాయుడు ఒక అంశంపై మాత్రం అందరికీ క్లారిటీ ఇస్తున్నట్టున్నారు. అదే కమలం పార్టీతో పొత్తు… తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఎత్తులన్నీ ఇప్పుడు కమలం పార్టీతో పొత్తు కోసం ఆరాటం లాగానే ఉన్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీతో దోస్తీ కోసం చాలా పాకులాడుతున్నారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటే బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లాలని బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ మధ్య ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏదో అవకాశం చూసుకుని ఢిల్లీకి వెళ్లి మోడీకి నమస్కారం చేసుకున్నారు. అప్పుడు మోడీగారు చంద్రబాబును చాలా బాగా పలకరించారని, చంద్రబాబుతో మాట్లాడాల్సినవి చాలానే ఉన్నాయని, త్వరలోనే సమావేశం పెట్టుకుందామంటూ మోడీ చెప్పారని తమ్ముళ్లు తెగ మాట్లాడుకున్నారు..
ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ బీజేపీ పెద్దలతో కూడా పొత్తులపై మాట్లాడినట్లు జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. పొత్తుల కోసం పవనే కాకుండా.. రజనీకాంత్ ను కూడా రంగంలోకి దించారట.
రజని తో బీజేపీ కి మంచిది సంబందాలే ఉన్నాయి. ఆయనతో మోడీ, అమిత్ షా లతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నరట బాబు.. ఎలాగైనా బీజేపీని కలుపుకోవాలనే ప్రయత్నాలు మాత్రం అత్యంత తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్టున్నాయి. మరీ వేచి చూద్దాం రజని ప్రయత్నాలు ఎంత వరకు పలిస్తాయో.






