22.6 C
India
Sunday, September 13, 2026
More

    Babu-Lokesh : మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో బాబు-లోకేష్

    Date:

    Babu-Lokesh
    Babu-Lokesh with Bill Gates

    Babu-Lokesh with Bill Gates : గత రెండురోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇంకా టీడీపీ మంత్రులు, నేతలు కొంతమంది దావోస్ పర్యటనలో ఏపీకి పరిశ్రమల కోసం పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో బిజీగా వున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిలను కలవడం, ఇంకా ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలను మీట్ అవుతూ బిజీగా కనబడుతున్నారు.

    తాజాగా మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటి దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటి కేంద్రాన్ని నెలకొల్పడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిన విషయాన్ని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తుచేశారు.

    శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎపిలో ఐటి అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతున్న వరల్డ్ క్లాస్ ఎఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించండి.

    మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి.

    రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఎపిని గేట్‌వేగా నిలపండి.

    మీ సహకారంత స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఎపి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉంది, ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు.

    కాగా మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటి దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    Chandra Babu : బాబు అంటే ఆ మాత్రం ఉంటుంది మరీ

    Chandra Babu : నిన్న పార్లమెంటు సమావేశాలు ఎంతో మంది రాజకీయ నాయకులతో...

    Andhra Pradesh : దేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించిన ఆంద్రప్రదేశ్

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో బలమైన...