Babu Skill Develop : ‘స్కిల్ డెవలప్‌మెంట్’ స్కాంలో కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంపై ఆంధ్రప్రదేశ్ రగిలిపోతోంది. రాష్ట్రం విడిపోయిన సమయంలో రాజధానితో పాటు అన్నీ రంగాలలో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన సీఎంగా ఎన్నికైన తర్వాత అన్నీ చక్క బడ్డాయని ఏపీ ప్రజలు అంటున్నారు. అన్నీ విస్తారిలో వడ్డిస్తే నేడు జగన్ వాటని అనుభవిస్తూ విస్తారును తన్నుతున్నాడని ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఏ నాయకుడి విషయంలో రోడ్డెక్కలేదు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో వారంతా రోడ్డెక్కారు. నిరసనలు, ధర్నాలు చేస్తూ బాబు అరెస్ట్ అప్రజాస్వామికమని, బేషరతుగా విడుదల చేయాలని నినాదాలు చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియా కూడా చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచింది. ఆయన అరెస్ట్ రోజు నుంచి జగన్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, కార్టూన్లు, ఇమేజ్ ల రూపంలో నిరసనలు పోస్ట్ అవుతూనే ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా చంద్రబాబుకు మద్దతుగా సోషల్ మీడియా ఉంది.
ఇటీవల ఒక కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ఏర్పాటు చేసి యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ ప్రభుత్వం వచ్చి స్కిల్ డెవలప్ మెంట్ ను ‘కిల్’ డెవలప్ మెంట్ గా మార్చిందని అనేలా ఉంది ఈ కార్టూన్. దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.