Baby మనసుకు హత్తుకుపోయే ప్రేమ కథ తీయాలి కానీ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రావడం ఖాయం.. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే విషయం పక్కన పెట్టి మరీ ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు. మరి ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అదే జరుగుతుంది.. యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది..
ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషించారు. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షోతోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తోనే ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. రెండవ వారం కూడా భారీ వసూళ్లను రాబట్టింది..
మధ్యలో ఒకటి అరా రోజులు కలెక్షన్స్ తగ్గిన వీకెండ్ మళ్ళీ పుంజుకుంది.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకు పోతుంది.. మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రావడం చాలా తక్కువుగా చూస్తుంటాం.. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకున్నాయి..
10 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మళ్ళీ వీకెండ్ లో విశ్వరూపం చూపించింది. 10వ రోజు శనివారం 2.33 కోట్ల రూపాయలు రాబట్టింది.. ఇక ఆదివారం అయితే ఈ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్య పోతున్నారు.. 10వ రోజు ఆదివారం ఏకంగా 4 కోట్ల షేర్ రాబట్టిందని అంచనా వేస్తున్నారు. ఈ వేగం చూస్తుంటే 100 కోట్ల క్లబ్ లోకి అతి త్వరలోనే చేరే అవకాశం అయితే ఉంది..