Baby 13 Days Collections :
ఈ మధ్య కాలంలో కోట్లు పెట్టి తీసిన సినిమాకు కూడా పట్టుమని 10 కోట్ల లాభాలు రావడం గగనం అవుతుంది.. మరి అలాంటి సమయంలో కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 8 కోట్ల బిజినెస్ చేసి 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన చిన్న సినిమాకు కోట్లకు కోట్ల లాభాలు వస్తున్నాయి.. రిలీజ్ అయ్యి 24 గడుస్తున్న ఇంకా వసూళ్లు చేస్తూనే ఉండడం సెన్సేషన్ అనే చెప్పాలి..
మరి ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండవచ్చు.. ‘బేబీ’.. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు వచ్చినన్ని లాభాలు మరో సినిమాకు రాలేదనే చెప్పాలి.. బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న బేబీ సినిమాకు ఎన్ని సినిమాలు వచ్చిన వాటిని వెనక్కి నెట్టి మరీ ఈ సినిమా ఒక్కటే గత 24 రోజులుగా థియేటర్స్ ను వదలకుండా వసూళ్లు రాబడుతూనే ఉంది..
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.. యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా 24 రోజులు గడుస్తున్న ఇప్పటికీ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూనే ఉంది. మరి 24వ రోజు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం..
24వ రోజు కూడా బేబీ సినిమా 70 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా 24 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 61.83 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.. దీంతో ఈ సినిమాకు మొత్తంగా 33.37 కోట్ల లాభాలను అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. సుమారు 10 కోట్ల బడ్జెట్ టిప్ తెరకెక్కిన ఈ సినిమాకు 77.70 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది.
ReplyForward
|