baby director బేబి దర్శకుడు సాయి రాజేష్ ఔదార్యాన్ని చాటాడు. ఓ బాలుడి వైద్యం కోసం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసి తన ఉదారతను చూపించాడు. ఆంధ్రప్రదేశ్ లోని అంబారిపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన ఏడాది వయసున్న బాలుడు ప్రమాదవశాత్తు వేడి నూనెలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో స్పందించిన సాయి రాజేష్ వారికి రూ.50 వేలు ఇవ్వడం గమనార్హం.
సాయి రాజేష్ మంచితనానికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశం ఉండటం నిజంగా గొప్ప విషయం. కోట్లున్నా సేవ చేసే గుణం అందరికి ఉండదు. ఉన్న దాంట్లో సాయం చేయడం నిజంగా దైవత్వంగా చెబుతున్నారు. ఆయన తీసిన బేబి సినిమా రూ. 80 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ రోజుల్లో అందరు కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రధారులుగా తీసిన సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధించింది. ఎమ్మెస్ కే నిర్మాతగా వ్యవహరించారు. హ్రదయ కాలేయం సినిమాతో దర్శకుడిగా మారిన సాయి రాజేష్ బేబి చిత్రాన్ని అద్భుతంగా తీశారని అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ఊళ్లో కంసాలి పని చేసుకునే నరసింహాచారిని సంపూర్ణేష్ బాబుగా పరిచయం చేసి అప్పట్లో సెన్సేషన్ చేశారు.
ఇంకా సాయిరాజేష్, విశ్వక్ సేన్ మధ్య కూడా ఈ సినిమా విషయంలో మాటల యుద్ధం కొనసాగింది. తన సినిమాను మొదట కథ వినేందుకు కూడా ఓ హీరో మొగ్గు చూపలేదని దర్శకుడు చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం పెరిగింది. కానీ ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు. సినిమా పరిశ్రమలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం కొత్తేమీ కాదు.