baby చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించడం మామూలే. ఈ నేపథ్యంలో బేబి సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ దూసుకుపోతోంది. పెద్ద సినిమాలను తలదన్నే రీతిలో బేబి సినిమా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే లాభాల పంట పండిస్తోంది. కొత్త నటులైనా పాత్రల్లో జీవించారు. ఆనంద్ దేవరకొండ నటన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వైష్ణవి చైతన్య నటన కూడా ప్లస్ అయింది.
ఇక దర్శకుడు సాయి రాజేష్ స్క్రీన్ ప్లే అందరిని మెప్పిస్తోంది. రెండో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ కూడా మంచి మార్కులు సాధించాడు. సినిమాను ఎస్ కేఎన్ నిర్మించాడు. రెండు రోజులకే పెట్టుబడి రాబట్టుకుంది. కానీ రెమ్యునరేషన్ విషయంలో వారికి అన్యాయమే జరిగిందని నెటిజన్లు వాపోతున్నారు. యూత్ కు బాగా కనెక్ట్ అయిన సినిమాగా బేబి నిలిచింది.
వైష్ణవి నటన ఎంతగానో ఆకట్టుకుంది. మంచి నటనతో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సినిమా ఇప్పటికే రూ. 16.57 కోట్ల లాభాలు తెచ్చుకుంది. ఇంత లాభాలు వచ్చినా నటులకు ఇచ్చింది మాత్రం అరకొరే. వారి పారితోషికం గురించి తెలిస్తే షాక్ కలుగుతుంది. రెమ్యునరేషన్ విషయంలో వారికి అన్యాయమే జరిగింది.
ఆనంద్ దేవరకొండకు రూ. 50 లక్షలు, హీరోయిన్ వైష్ణవికి రూ. 30 లక్షలు, విరాజ్ అశ్విన్ కు రూ. 20 లక్షలు మాత్రమే ఇచ్చారట. దర్శకుడు సాయి రాజేష్ మాత్రం రూ. కోటి తీసుకున్నాడని సమాచారం. ఇలా నటుల విషయంలో పారితోషికం ఇంత తక్కువగా ఇవ్వడం బాధాకరమే అని ప్రేక్షకులు చెబుతున్నారు. బేబి సినిమా ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.