‘Baby’ Preview Talk :
ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ తోనే సినిమాలను ఆకర్షిస్తున్నారు మేకర్స్.. రిలీజ్ తర్వాత మూవీ రిజల్ట్ పక్కన పెడితే ముందు నుండే సినిమాల నుండి టీజర్, ట్రైలర్, సాంగ్స్ వంటి వాటితో ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నారు. మరి ఇటీవల కాలంలో అలా ప్రేక్షకులను ఆకర్షించిన సినిమాల్లో ‘బేబీ’ సినిమా ఒకటి..
ఆనంద్ దేవరకొండ హీరోగా యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘బేబీ’.. విజయ్ దేవరకొండ తమ్ముడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ.. ఈయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ అంతగా ఇంపాక్ట్ మాత్రం చూపించలేక పోతున్నాడు. వచ్చిన సినిమా వచ్చినట్టు ప్లాప్ అవుతుంది.
అందుకే ఆనంద్ దేవరకొండ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. ఈ క్రమంలోనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ‘బేబీ’ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో తాజాగా ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇది ట్రైయాంగులర్ లవ్ అని తెలుస్తుంది.. తాజాగా ఈ సినిమా మొదటి కాపీ ప్రివ్యూ షోను హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో సినీ ప్రముఖులు, మీడియా మిత్రులు చూడగా వారి నుండి వచ్చిన టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా గుండెకు హత్తుకునే లవ్ సినిమాల జాబితాలో నిలుస్తుందట.
అంతేకాదు మరో ప్రేమిస్తే సినిమా అవుతుంది అంటున్నారు. ఆ సినిమా ఎలా అయితే ఇప్పటికి ప్రేక్షకుల మదిలో నిలిచి పోయిందో ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుంది అంటున్నారు.. ఇద్దరు హీరోల కంటే హీరోయిన్ పాత్ర అందరి మదిలో నిలుస్తుందని వైష్ణవి చైతన్య కెరీర్ ఈ సినిమాతో టర్న్ అవ్వడం ఖాయం అంటున్నారు.. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను కూడా అంతే మెప్పిస్తుందో లేదో..