“Baby” Movie Trailer :
ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాల్లో యూత్ ను ఎక్కువగా ఆకర్షించుకునేదిగా ‘బేబీ’ ఉంటుందని ఇప్పటి నుంచే టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీలో సెకండ్ హీరోగా విరాజ్ అశ్విన్ నటిస్తున్నాడు. యూట్యూబర్ వైష్టవీ చైతన్య (సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఫేమ్) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఉన్న సినిమాలకు భిన్నంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేస్ తో చేసిన కథ కాబట్టి భారీ వ్యూవ్స్ దక్కించుకుంది. దీనిపై భారీ అంచనాలే పెట్టుకుంటున్నారు మేకర్స్.
రీసెంట్‌గా రిలీజైన పోస్టర్ పై ‘హీరోయిన్ నోట్లో బ్లేడ్ పెట్టుకొని, హీరో గెడ్డం గీకే విధంగా’ ఉంటుంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ రోజు(జూలై 8) విడుదలైన ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. దీంతో పాటు థియేట్రికల్ టైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అసలు ట్రైలర్ లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం.
ఈ సినిమాకు డైరెక్టర్ గానే కాకుండా, నిర్మాత బాధ్యతలను కూడా ‘కలర్ ఫొటో’ ఫేం సాయి రాజేశ్ తీసుకున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పాఠశాల నుంచి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ పైచదువుల కోసం కాలేజ్ కు వెళ్తుంది. అప్పటి వరకు డీ గ్లామర్ గా ఉన్న ఆమె అక్కడి ఫ్రెండ్స్, వాతావరణంతో గ్లామర్ లుక్ లోకి మారిపోతుంది. ఆ కాలేజీలోనే చదువుకుంటాడు విరాజ్ అశ్విన్.
విరాజ్ అశ్విన్ తో పరిచయం నేపథ్యలో ఆనంద్ తో ప్రేమను తగ్గిస్తూ ఉంటుంది చైతన్య. ఇక విరాజ్ అశ్విన్ కూడా హీరోయిన్ అయిన వైష్ణవిని ప్రేమిస్తాడు. ఈ విషయం ఆనంద్ కు తెలుస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని టచ్ చేస్తూ సాగిన ఈ ట్రైలర్ ను యూత్ ఎక్కువ వైరల్ చేస్తుంది. కథ పూర్తిగా పాతదే అయినా స్ర్కీన్ ప్లే బాగుందని పిస్తుంది.
డైరెక్టర్ సాయి రాజేశ్ దీన్ని ఏ విధంగా ప్రజెంట్ చేశాడన్న దానిపై ప్రస్తుతం యూత్ సందేహాలు వ్యక్తం చేస్తుంది. ఎలాగైనా సినిమాను చూడాలనే ఉత్సాహంతో ఉన్నారు యూత్. వ్యూవ్స్ అండ్ షేర్ చూస్తే మాత్రం సినిమా భారీ హిట్టే అయ్యేట్లు అనిపిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటే మరో హిట్ పడ్డట్లేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 14న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.