Back Pain Yoga : ప్రజెంట్ జనరేషన్ ఉరుకులు, పరుగులతో సాగుతోంది. ఉద్యోగాలు, ఇంటి పనులు బయటి పనులు ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. దీంతో సాధారణంగానే శరీరం అలసిపోయి భయంకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. వీటిని ఎదుర్కొనేందుకు అప్పుడప్పుడు కొన్ని స్వచ్ఛంద సంఘాలు ముందుకు వస్తున్నాయి. మానవ ఆయుష్షును పెంచేది యోగా మాత్రమే అని సూచిస్తూ.. యోగాతో కలిగే ప్రయోగాలను వివరిస్తున్నారు.
సేవా ఇంటర్నేషనల్ సెంట్రల్ జెర్సీ చాప్టర్, సుబోధ్ వోగా భాగస్వామ్యంతో ‘బ్యాక్ పెయిన్ యోగా థెరపీ వర్క్ షాప్’ ఏర్పాటు చేస్తున్నారు. నొప్పి లేకుండా అసౌకర్యం నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఇందులో చేరాలని సూచిస్తున్నారు. ఈ వర్క్ షాప్ ను నాలుగు రోజులు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 01, 07, 08వ తేదీల్లో కొనసాగుతుంది. న్యూజెర్సీ-08817, ఎడిషన్, 7 క్లిమ్మిర్, రాధాగోపీనాథ్ టెంపుల్ లో సాయంత్రం 3 గంటల నుంచి 6.30 గంటల వరకు వర్క్ షాప్ కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ కోసం 100 డాలర్లు చెల్లించాలని నిర్వాహకులు సూచించారు. మొత్తం 4 సెషన్ల వర్క్‌షాప్ కు హాజరైన తర్వాత 25 శాతం తిరిగి చెల్లిస్తారని వివరించారు. మరింత సమాచారం కోసం: 702.900.SEWAకి కాల్ చేయాలని సూచించారు.
• నొప్పి నిర్వహణ
• కండరాలను బలోపేతం చేయడం
• జీవనశైలి చిట్కాలు
• వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం
• ప్రశ్నలు, సమాధానాల సెషన్‌లు తదితరాలు ఉంటాయని తెలిపారు.
ఈ వర్క్ షాప్ లో.. రాహుల్ భలేరావు, విజయ తురిమెళ్ల పాల్గొని యోగా థెరపి, యోగాతో కలిగే ప్రయోజనాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు. వీరు యోగా విద్యను అభ్యసించారని, వారి ఆధ్వర్యంలో మరింత మెరుగైన శిక్షణ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.