
Credit card : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెబుతోంది. ఇక మీదట బ్యాంక్ సీర్వీసుల్లో భారీగా కోతలు విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల జేబులు గుల్ల కానున్నాయి. బ్యాంకులు ఇలా చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రోజురోజుకు రేట్లు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోంది. దీంతో వారికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు.
ఎస్బీఐ గురువారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జువెల్లరీ, స్కూల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీసులు, అటిలిటీస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కార్డ్స్, మెంబర్ ఫైనాన్సియల్ ఇన్ స్టిట్యూషన్, క్యాసీ క్యాష్, రైల్వేస్ వంటి వాటిల్లో చెల్లింపులపై ఇకపై ఎలాంటి క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఇకపై ఎస్బీఐ కార్డ్ త వీటిలో పేమెంట్స్ చేస్తే ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు.
క్యాష్ బ్యాక్ ల్లో భారీగా కోతలు విధించింది. ఇక మీదట ఆన్ లైన్ చెల్లింపులు చేసినప్పుడు ఒక స్టేట్ మెంట్ సైకిల్ లో గరిష్టంగా రూ. 5 వేలు మాత్రమే క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనిపై పరిమితులు విధిస్తూ ఎస్బీఐ ప్రకటన విడుదల చేసింది. దీంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. దేశవ్యాప్తంగా 21 ఎయిర్ పోర్టుల్లో 42 లాంజ్ లతో టై అప్ అయి ఉంది.
తన లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకోవాలనుకునే వారిపై ప్రాసెసింగ్ సహా టాక్సులు వసూలు చేయాలని నిశ్చయించింది. డిసెంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 99తో పాటు జీఎస్టీ సహా ఇతర పన్నులు ఉంటున్నాయి. మరోవైపు ఈ ఏడాది మార్చిలో కూడా ఎస్బీఐ కార్డ్స్ అండ్ మరో షాకింగ్ ప్రకటన చేసింది. క్రెడిట్ కార్డుతో పాటు రెంటు పేమెంట్ చేసే వారికి విధించే చార్జీలను వంద శాతం మేర పెంచింది.