
Balagam director next movie : టాలీవుడ్ లో న్యాచురల్ స్టోరీలతో సినిమాలు పెద్దగా రావు.. అందుకే ఆ జోనర్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఎప్పుడో ఒకసారి అలాంటి జోనర్ లో సినిమాలు తెరకెక్కితే వాటికీ పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. మరి మన తెలుగులో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక జోనర్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమానే ”బలగం”..
ఈ సినిమా పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సహజ సిద్ధమైన క్యారెక్టర్ లతో అచ్చం మన చిన్నప్పుడు జరిగిన విషయాలను గుర్తు చేస్తూ తెరకెక్కింది. దీంతో ఇది బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలంగాణ పల్లెలో జరిగే అచ్చమైన సన్నివేశాలను గుర్తు చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా తెరకెక్కించిన వేణుకు కూడా మంచి పేరు తెచ్చింది.
ప్రముఖ కమెడియన్ వేణు మొదటిసారిగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సెన్సేషనల్ హిట్ తర్వాత బలగం వేణు మరో సినిమాను ప్రకటించలేదు.. దీంతో ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తాడు? ఎలా తీయబోతున్నాడు ? అని అందరిలో ఒక క్యూరియాసిటీ నెలకొంది.
ఇక సెన్సేషన్; హిట్ తర్వాత వేణు నుండి ఇన్ని రోజులకు మరో అప్డేట్ వచ్చింది. ఈయన సెకండ్ సినిమా గురించి ఈ రోజు వేణు తన సోషల్ మీడియా వేదికగా అప్డేట్ తెలిపాడు.. సెకండ్ మూవీ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినట్టు చెబుతూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. మరి దిల్ రాజు ఈయన కథ నమ్మి మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇక రెండవ సినిమా ఎవరితో తీస్తున్నాడో చూడాలి.






