‘Balagam’ topic In Group-4 :
గ్రూప్స్, సివిల్స్ లాంటి పరీక్షా పేపర్ లో సినిమా గురించి కూడా అడగడం కామనే. కానీ అయితే గతంలో అయితే కరణ్ జోహార్ లాంటి డైరెక్టర్స్ తీసిన బాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే వారు. కానీ ఈ రోజు (జూలై 1) కొనసాగిన గ్రూప్ 4 క్వశ్చన్ పేపర్ లో ‘బలగం’ సినిమా గురించి ఒక ప్రశ్న అడిగారు.
జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలంగాణ బతుకు జీవనానికి అద్ధం పడుతుంది. పల్లెలు అందులోని సౌందర్యం, ఊరిలోని ప్రతీ ఒక్కరి పలకరింపు, అందరినీ చుట్టాలుగా భావించడం లాంటి సున్నిత మైన అంశాలను సినిమాలో వేణు చూపించారు. మనిషి బతికి ఉన్నంత జరిగే ప్రయాణం చనిపోయిన తర్వాత కూడా జరిగే ప్రయాణాన్ని వేణు కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారు.
కుటుంబ పెద్ద చనిపోవడం, ఆయన ఆత్మకు శాంతి చేకూరే పనులు చేయడంలో కుటుంబం విఫలమవడం ఈ నేపథ్యంలో కథ చివరికి సుఖాంతం అవుతుంది. ఈ సినిమాపై సీఎం నుంచి గల్లీ లీడర్ల వరకు ప్రశంసల జల్లు కురిపించారు. ఊళ్లల్లో ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి చిత్రాన్ని ప్రదర్శించారు. సినిమా థియేటర్లు రాక ముందు గ్రామల్లో తెర ఏర్పాటు చేసి సినిమాలను ప్రదర్శించే వారు. ఆ సంప్రదాయం మళ్లీ ఈ సినిమాతో మొదలైందని చెప్పవచ్చు. చాలా వరకు గ్రామాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు నిర్మాతలు. కుటుంబంలోని ప్రేమ, ఆప్యాయతలు లాంటివి చూసిన కుటుంబ సభ్యులు చాలా వరకు కలిసి పోయారు. బతికుండి ప్రేమగా ఉండాలి కానీ చనిపోయిన తర్వాత ఎంత ప్రేమ చూపినా దండుగనే అంశాన్ని పలువురు ప్రస్తావించారు.
ఇక సినిమాకు సంబంధించి గ్రూప్ 4 క్వశ్చన్ పేపర్ లో ఒక ప్రశ్న కనిపిచించింది. బలగం సినిమాకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతకూడుతాయి.?
A. దర్శకుడు వేణు యెల్దండి
B. దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి
C. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో
D. కొమురయ్య పాత్రను పోషించిన వరు: అరుసం మధుసూదన్
1. A, B మరియు D 2. A మరియు B మాత్రమే
3. A, B, C మరియు D 4. A, B మరియు C
ఇందులో సరైన సమాధానం. 4 కరెక్ట్.