30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Balaiah Bhagwant Kesari : ఏకంగా రూ.18 కోట్లా.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్రేజ్ మాములుగా లేదుగా!

    Date:

    Balaiah Bhagwant Kesari
    Balaiah Bhagwant Kesari

    Balaiah Bhagwant Kesari : నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న విషయం తెలిసిందే.. వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమాకు ఇటీవలే బాలయ్య బర్త్ డే రోజు టైటిల్ అండ్ టీజర్ అనౌన్స్ చేసారు.

    ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా నెక్స్ట్ లెవల్లో రెస్పాన్స్ అందుకుంది.. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనిల్ రావిపూడి బాలయ్యను ఎలా చూపిస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ టీజర్ తోనే సెన్సేషనల్ రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

    షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.. అలాగే బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది.. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే 70 శాతం షూట్ పూర్తి అయినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో షూట్ శరవేగంగా పూర్తి చేయడమే కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటున్నారు.

    తాజాగా బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఓటిటి డీల్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రీసెంట్ గానే ఈ డీల్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యధిక ధర పెట్టి దక్కించుకుంది అని తెలియగా ఇప్పుడు బాలయ్య కెరీర్ లోనే 18 కోట్ల రూపాయలకు పైగా ఓటిటి రైట్స్ కోసం అమెజాన్ పెట్టినట్టు తాజా సమాచారం.. గతంలో వీరసింహారెడ్డి 15 కోట్ల భారీ ధర పలుకగా ఇప్పుడు ఆ సినిమా కంటే మరింత డిమాండ్ పెరిగింది. బాలయ్య సినిమాల్లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. చూడాలి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడా లేదా..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhagwant Kesari 5days Collection : దుమ్ములేపుతున్న భగవంత్ కేసరి.. ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే…?

    Bhagwant Kesari 5days Collection : నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస...

    Bhagwant Kesari : ఆడ బిడ్డల తల్లులకు ఆ పాఠం చెప్పిన భగవంత్ కేసరి.. 

    Bhagwant Kesari : దసరా కానుకగా వచ్చిన ‘భగవంత్ కేసరి’కి ఆదరణ...

    Bhagwant Kesari Collections : ‘భగవంత్ కేసరి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్?

    Bhagwant Kesari Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్స్...