
Bhagwant Kesari : నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే బాలయ్య ఈ సారి తన 108వ సినిమాగా భగవంత్ కేసరిలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాల్లో బాలయ్య నటన అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకునే బాలయ్య భగవంత్ కేసరి విషయంలో కూడా అలాంటి తీరుగానే వ్యవహరించాడని తెలుస్తోంది.
గతంలోనే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చేది. బాలయ్య వందో సినిమాగా అనిల్ రావిపూడి రామారావు అనే కథ సిద్ధం చేశారు. కానీ వందో చిత్రం భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో చారిత్రాత్మక సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి తీశారు. దీంతో వీరి కాంబినేషన్ కోసం ఇప్పటి దాకా ఆగాల్సి వచ్చింది. కొందరు రామారావు కథే మళ్లీ తీస్తున్నారని అనుకున్నా అందులో వాస్తవం లేదు.
భగవంత్ కేసరిలో హీరోయిన్ గా కాజల్ నటిస్తోంది. మరో రోల్ లో శ్రీలీల చేస్తోంది. భగవంత్ కేసరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా మలచాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ చూపులు, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉండనున్నాయని చెబుతున్నారు. టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. భగవంత్ కేసరి సినిమాలో ఏ విధమైన మసాలాలు ఉండబోతున్నాయో తెలుస్తోంది.
సంక్రాంతికి వీర సింహారెడ్డి తో హిట్ అందుకున్న బాలయ్య దసరాకు భగవంత్ కేసరితో మరోమారు విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ ఎంటర్ టైన్ చేసే ఉద్దేశంతో బాలకృష్ణ హంగామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలయ్య తన 108వ సినిమాను అన్ని అంశాలతో కూడిన మాస్ మసాలాగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.