
Balakrishna Emotional : ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రజినీ కాంత్ దంపతులు, జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, నితీన్ గడ్కరీ అందరూ హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత మోదీ అందరినీ పలకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ అక్క భువనేశ్వరి నుదుటి పై ముద్దు పెట్టి ఆనందాన్ని పంచుకున్నాడు. నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో రోజూ పార్టీని ముందుండి నడిపించింది. చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. భువనేశ్వరి తో పాటు కోడలు బ్రాహ్మిణి, కొడుకు నారా లోకేశ్ కూడా ఢిల్లీలో 15 రోజులు ఉండి చక్రం తిప్పారు.
అమరావతి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని గతంలో తన బంగారు గాజులను ఇచ్చి వారి ఉద్యమానికి సాయం చేసింది. ఇలా అనేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని తెలుగు దేశం పార్టీకి సేవలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా ఆమెను రంగంలోకి దిగి సమావేశాలు నిర్వహించారు.
టీడీపీ కార్యకర్తలు మనో వేదనకు గురికాకుండా చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి బయట పడేలా ఆమె చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఎంతో మేలు చేశాయి. చివరకు 52 రోజుల అనంతరం చంద్రబాబు విడుదల అయిన తర్వాతనే ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎన్టీఆర్ కూతురుగా.. చంద్రబాబు భార్యగా.. ఆమె కర్తవ్యాన్ని నిర్వహించారు. ఈ రోజు పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణమయ్యారు. దీంతో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆమె చూపిన తెగువ, ధైర్యాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.