
Balakrishna : నందమూరి బాలకృష్ణ త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని నిన్నటి నుండి ఒక వార్త వైరల్ అవుతుంది.. అక్కడి స్టార్ హీరోతో ఈయన మల్టీస్టారర్ చేయబోతున్నాడు అంటూ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.. మరి అసలు విషయం లోకి వెళ్తే..
ఈ మధ్య బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.. రెండు సూపర్ హిట్స్ పడడంతో నెక్స్ట్ ఈయన చేయబోయే సినిమాలపై భారీ హైప్ పెరిగింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.
షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.. అలాగే బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది.. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో బిజీగా ఉండగానే బాలయ్య కన్నడ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
అతడి త్వరలో బాలయ్య కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో ఒక మల్టీస్టారర్ సినిమా చేయనున్నారట.. ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుండగా శివరాజ్ తో కలిసి ఫస్ట్ పార్ట్ లో బాలయ్య, సెకండ్ పార్ట్ లో రజినీకాంత్ నటించనున్నారని అక్కడి మీడియా చెబుతుంది. హర్ష డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలను భారీ స్థాయిలో స్టార్ నిర్మాణ సంస్థతో కలిసి శివరాజ్ కుమార్ తన సొంత సంస్థపై నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.