
Tana Sabha : అమెరికాలో ప్రతి సంవత్సరం నిర్వహించే తానా మహాసభలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మన దేశం నుంచి చాలా మందిని ఆహ్వానిస్తున్నారు. సభలను దిగ్విజయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నారు. రాజకీయ, సినిమా రంగాలకు చెందిన వారిని చాలా మందిని ఇప్పటికే ఆహ్వానించారు.
ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలక్రిష్ణను తానా సభలకు రావాలని ఆహ్వానించారు. జులై 7 నుంచి 9 వరకు అమెరికాలో నిర్వహించే తానా సభలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. దీని కోసం చాలా మందిని పిలుస్తున్నారు.
2022 డిసెంబర్లో తానా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి రూ. కోటి విరాళం ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని బాలక్రిష్ణ వారికి ధన్యవాదాలు తెలిపారు. తానా సభలకు తప్పకుండా హాజరవుతానని చెప్పారు. అమెరికాలో తెలుగువారు చేసుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి. దీంతో ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు.
సీఎం కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులను కూడా పిలిచారు. దీంతో సభకు ఎవరెవరు వస్తారో అని అంచనా వేసుకుంటున్నారు. జులైలో నిర్వహించే తానా సభలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ మేరకు మనరాష్టంలో చాలా మందిని రావాలని ఆహ్వానాలు అందిస్తున్నారు. దీనిపై సభ్యులు మాట్లాడుతూ తానా సభలను విజయవంతం చేస్తామని చెప్పారు.