సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఓ యువతితో కలిసి దిగిన ఫొటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటో నెటిజన్ల ఆసక్తిని రేకెత్తించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన తానా (TANA) వేడుకలకు హాజరైన ఆయన తన ఫ్యాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.
తానా సభలకు అమెరికా వెళ్లిన బాలకృష్ణను ఆమె కలిసింది. తన అభిమానిగా పరిచయం చేసుకుని, తన పుట్టినరోజు కాబట్టి ఆశీర్వదించాలని కోరినట్లు సమాచారం. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ కేక్ ఆర్డర్ చేసి కట్ చేసి ఆమెతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి బాలకృష్ణ తన ఫ్యాన్ అయిన ఆ యువతిని ఆశీర్వదించారు. ఇంతటి ఉదారతకు, అభిమానుల పట్ల ప్రేమ చూపే బాలకృష్ణ తన ఆలోచనాత్మక హావ భావాలతో ఆ మహిళ పుట్టిన రోజును చిరస్మరణీయం చేశాడు.
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు బాలకృష్ణను తెగ పొగుడుతున్నారు. బాలయ్య బాబు ఎక్కడున్నా తన విశాలమైన మనస్సుతో తన అభిమానులను పలకరిస్తుంటారని, ఆయన కోపంగా తిట్టినా, పొగిడినా సంతోషమే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.