YCP Insulted Tollywood : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ మధ్య మాటల యుద్ధం పెరిగింది. తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. దీనికి స్పీకర్ బాలక్రిష్ణపై బహిష్కరణ వేటు వేశారు. బాలక్రిష్ణ మీసం మెలేసి తొడగొట్టి సభా మర్యాదలు అగౌరపరచారని స్పీకర్ ఆరోపణ. దీంతో బాలక్రిష్ణ ఆవేశానికి గురయ్యారు.
వైసీపీ నేతల తీరు సరిగా లేదని వాపోయారు. కళాకారులను అవమానిస్తూ హేళన చేస్తున్నారని మండిపడ్డారు. కళాకారుడైన ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడని కొనియాడారు. అలాంటి కళాకారులపై దురుద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించరు. వైసీపీ నేతల బలుపు మాటలకు బదులు తీర్చుకుంటామని చెబుతున్నారు.
అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోనే తాను కూడా బదులిచ్చాను తప్ప తొడ గొట్టలేదని గుర్తు చేశారు. సీఎం జగన్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆడుతున్న మైండ్ గేమ్ కు చెక్ పెడతామని హెచ్చరించారు. వైజాగ్ లో జూనియర్ ఆర్టిస్టులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఎద్దేవా చేశారు. బాబుపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఏపీలో సభా మర్యాదలు గంగలో కలుస్తున్నాయి. తోటి సభ్యులను హేళనగా చూడటం సరికాదని బాలక్రిష్ణ అన్నారు. చిత్ర పరిశ్రమ వారిని కించపరచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కళాకారులను తక్కువగా చేసి చూడటం వల్ల మనోభావాలు దెబ్బ తింటాయన్నారు. అందుకే వారి తరఫున మాట్లాడానని చెప్పారు. మంత్రులు ఇలా తక్కువగా చేసి మాట్లాడటం జీర్ణించుకోలేకపో యానని ఆవేదన వ్యక్తం చేశారు.