నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసాడు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని JRC లో వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ వేడుకలలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్ , జొన్నలగడ్డ సిద్దార్థ్ లు హాజరు కావడం విశేషం. అలాగే హీరోయిన్ లు హానీ రోజ్ , వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ వేడుకలో మాట్లాడిన బాలయ్య మరోసారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసాడు. ఈమధ్య ఏం మాట్లాడినా కేసులు పెట్టడం సాధారణమై పోయిందని , కేసులు పెడితే భయపడేది లేదని కుండబద్దలు కొట్టాడు బాలయ్య. ఇక వీరసింహారెడ్డి చిత్రంలో చాలా డైలాగ్స్ ఏపీ ప్రభుత్వంపైన చేసినవే అనే విషయం తెలిసిందే. ఆ డైలాగ్స్ కు థియేటర్ లలో విపరీతమైన స్పందన వచ్చింది.
జనవరి 12 న విడుదలైన వీరసింహారెడ్డి సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 130 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బాలయ్య చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది వీరసింహారెడ్డి. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించగా హానీ రోజ్ , శృతి హాసన్ లు బాలయ్య సరసన నటించారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య చెల్లెలుగా నటించగా విలన్ గా దునియా విజయ్ నటించాడు.