30.7 C
India
Wednesday, February 18, 2026
More

    Balayya Birthday Celebrations : బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

    Date:

    Balayya Birthday Celebrations
    Balayya Birthday Celebrations

    Balayya Birthday Celebrations : ప్రముఖ తెలుగు నటుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు ఏపీలో ఘనంగా జరుగుతున్నాయి. బొర్రా దిలేశ్ యూత్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వందలాది మంది బాలయ్య అభిమానులు, తెలుగు యువత నాయకులు, టీడీపీ కార్యకర్తల జై బాలయ్య, జై జై బాలయ్య నినాదాల మధ్య సంబరంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. అలాగే టపాకులు కాల్చి, స్వీట్లు పంచారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బాలకృష్ణ ఎమ్మెల్యేగా హిందూపురం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజ హితమైన సినిమాలతో బాలకృష్ణ మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ సేవలు చిరస్థాయి కావాలని కోరుకున్నారు. అలాగే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు.
    కాగా, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు వేదపండితుల ఆశ్వీరచనాలు అందజేశారు. హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య హాట్రిక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంతనియోజకవర్గంలో అభిమానుల వద్ద ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
    అలాగే బాలకృష్ణకు  ఆయన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేష్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ, రాజకీయ రంగాలలో తిరుగులేని ప్రజాదరణతో నిండు నూరేళ్లూ ఆనంద, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. కాగా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బాలయ్య జన్మదినాన్ని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా బాలయ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆయనతో మరో సినిమా చేస్తున్నట్టు బోయశ్రీను మీడియాకు తెలియజేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...

    Chandrababu : ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు సంచలనం

    Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. అలిపిరిలో...