Balineni Srinivasa Reddy ఒంగోలు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి ఆ ప్రాంతంలో ఎదురులేని రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాస రెడ్డి గురించి ఆంధ్ర రాజకీయాలలో తెలియని వారుండరు. ఇతడు ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి బంధువు. ఇతడు మాజీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డి సోదరిని వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఇతడు ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాంతీయ సమన్వయ కర్త పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చి వేరే పార్టీ లో సైతం చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు ఏపీ లో దుమారం లేపుతున్నాయి.
ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బాలినేని విషయం జగన్ కు కొంత ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. బాలినేని ని ఎలాగైనా ప్రాంతీయ సమన్వయకర్త గా కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయమై విజయసాయిరెడ్డి తో చర్చలు జరిపిన జగన్ ఆ బాధ్యతను విజయసాయిరెడ్డి కి అప్పగించాడని వైసీపీ కార్యకర్తలు తెలిపారు. ఒక వేళ బాలినేని ఒప్పుకోకపోతే ప్రాంతీయ సమన్వయ బాధ్యత ను తనే తీసుకోవాలని విజయసాయిరెడ్డి కి జగన్ సూచించినట్లు తెలుస్తుంది. దీంతో బాలినేని ఇంటికి స్వయంగా ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్ళి కలిశారు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయ కర్త పదవికి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అలాగే పార్టీ కార్యకలాపాలలో ఎప్పటిలాగే చురుకుగా పాల్గొనాలని సూచించినట్లు తెలుస్తుంది.
బాలిరెడ్డి తో రాజకీయంగా విబేధిస్తున్న వై వీ సుబ్బారెడ్డి కి ఇన్ ఛార్జి గా ఉత్తరాంధ్ర జిల్లాలను అప్పగిస్తున్నట్లు బాలిరెడ్డికి తెలిపినట్లు
వైసీపీ లో పలువురు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. వై వీ సుబ్బారెడ్డి జోక్యం ఇకపై బాలిరెడ్డి పై ఉండదని వైసీపీ పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ బుజ్జగింపు
విషయంపై విజయసాయి రెడ్డి గానీ, బాలిరెడ్డి గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాని విజయసాయి రెడ్డి బుజ్జగింపుతో బాలిరెడ్డి
పార్టీలోనే కొనసాగాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.