Bandi Sanjay : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థులతో కలిసి చేపట్టిన చలో సచివాలయం ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అశోక్ నగర్ నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చిన బండి సంజయ్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీగా చేరుకున్న పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా, గ్రూప్-1 అభ్యర్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా చేరుకున్న పోలీసులు గ్రూప్-1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, అతి కష్టం మీద బండి సంజయ్ ను అక్కడి నుంచి తరలించారు.
Breaking News