
Bandi Sanjay reacted : ఉగ్రకదలికల నేపథ్యంలో రాష్ర్టం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. పైగా సదరు ఉగ్ర సంస్థలో చేరుతున్న వారికి కూడా రాష్ట్రంలోని అడవుల్లో ట్రైనింగ్ ఇచ్చారని పోలీసులు చెప్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల ముందస్తు సమాచారంతో మధ్య ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్లు, తెలంగాణ లోని కౌంటర్ ఇంటలీజెన్స్ సిబ్బందితో కలిసి హైదరాబాద్ లో మంగళవారం జాయిట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మహ్మద్ సలీం, షేక్ జునైద్, అబ్దుల్ రహెమాన్, హమీద్, మహ్మద్ అబ్బాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ గ్రూప్ తో సంబంధం ఉన్న కీలక వ్యక్తి మహ్మద్ సల్మాన్ ను బుధవారం అరెస్ట్ చేశారు.
వారిని విచారిస్తే సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ‘హిజ్బుత్ తెహ్రిర్’ అనే ఉగ్రవాద సంస్థలో చేరిన ఆర్మ్ డ్ వింగ్ యువకులకు సాయుధ శిక్షణతో పాటు బయోలాజికల్ , బ్యాక్టీరియల్ వార్ లో శిక్షణ ఇస్తున్నామని వారు పోలీసులకు చెప్పారు. ఈ ఉగ్ర సంస్థలో యూసీన్ కీలకమని, ఆయనే యువతను ప్రలోభాలకు గురి చేస్తున్నారని తమ విచారణలో తెలిసిందని పోలీసుల పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ లో పట్టుబడ్డ ఆరుగురిలో ముగ్గురు మతం మరినవారే అని తెలుస్తుందన్నారు. వీరితో పాటు యాసిన్ మరో 20 మంది వరకూ మతం మార్చాలని, వారిని ఉగ్రవాద దాడుల్లో వినియోగించుకోవాలని చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వం కాబట్టే ఉగ్రవాదులు హైదరాబాద్ కేంద్రంగా విచ్చల విడిగా తిరుగుతున్నారని, వారికి ఎంఐఎం అండగా ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ప్రలోభాలకు గురి చేసి ఇప్పటికి అనేక మందిని వారు మతం మార్చినట్లు వారే ఒప్పుకున్నారని కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఏదైనా సాధ్యమని అన్నారు.






