
Bandla Ganesh tweet : బండ్ల గణేష్ గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు అంటే అతియసోక్తి కాదేమో.. ఈ మధ్యనే కాస్త వివాదాస్పద కామెంట్స్ ను చేయడం లేదు అని అంతా అనుకుంటున్నారు.. ట్విట్టర్ లో బండ్ల గణేష్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచేవాడు.. తనకి నచ్చినట్టు పోస్టులు పెడుతూ తనని ఎవరో మోసం చేసినట్టు ఇప్పుడు బుద్ధి వచ్చినట్టు ట్వీట్స్ చేస్తూ హల్ చల్ చేస్తూనే ఉంటాడు.
మరి ఈ ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి ఎందుకు పెడతాడో ఎవ్వరికి అర్ధం అయ్యేది కాదు.. కానీ తాజాగా ఎన్టీఆర్ గురించి మాత్రం ఒక పోస్ట్ పెట్టాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ తాజాగా తన 30వ సినిమాను చేస్తున్నాడు.. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి..
ఈ సినిమా ఇప్పటికే షూట్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసారు.. ఇక రెండవ షెడ్యూల్ కోసం సన్నద్ధం అవుతున్నారు.. ఇక ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక్కడే స్టార్ట్ అయ్యింది అసలు రచ్చ.. బండ్ల గణేష్ గత కొన్ని రోజుల క్రితమే దేవర అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడట.. ఎన్టీఆర్ టైటిల్ కు ఇదే పేరు ఉండడం చూసి బండ్లన్న రియాక్ట్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ తో ఆయన భవిష్యత్తులో తీయబోతున్న ఈ సినిమా కోసం దేవర అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించి పెట్టుకున్నారట.. ఇప్పుడు అదే టైటిల్ ను బండ్ల గణేష్ అనుమతి లేకుండా తీసేసుకున్నాడని నా టైటిల్ దొబ్బేసాడు అంటూ గొడవ స్టార్ట్ చేసాడు.. మరి ఇది ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి..