‘Bangkok Pilla’ :
బ్యాంకాక్ వింతలు విశేషాలను కండ్లకు కట్టినట్లు చూపిస్తున్న ‘బ్యాంకాక్ పిల్లా’ శ్రావణి మరో అచీవ్‌మెంట్ సాధించింది. అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని సీజన్ 7 వైపు పరుగు పెడుతోంది. సీజన్ 7లో కంటెస్టెంట్స్ గురించి ఇప్పటి వరకు పెద్దగా అనౌన్స్ లేకున్నా బ్యాంకాక్ పిల్ల శ్రావణి మాత్రం కన్ఫమ్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనుకు అస్సలు పరిచయం లేని వారిని కూడా పాపులర్ చేస్తుంది ఈ షో. ఇందులో పార్టిసిపెంట్ చేసిన ఎంతో మంది ప్రస్తుతం బయట బిగ్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్నారు.
శ్రావణి విషయం పక్కన పెడితే ఈ సారి షోలోకి ఎవరిని తీసుకువస్తారు. సామాన్యులనా? లేక సెలబ్రెటీలనా? అన్న సందేహం ప్రతి ఒక్కిరికీ కలుగుతుంది. ప్రతీ సారి కొత్త వారు వస్తున్న నేపథ్యంలో ఈ సారి బ్యాంకాక్ పిల్ల ఎంపిక దాదాపు జరిగిపోయిందని తెలుస్తుంది.
‘బ్యాంకాక్ పల్లా’ యూ ట్యూబ్ ఛానెల్ పెట్టి బాగా ఫేమ్ అయ్యింది శ్రావణి సమంతపూడి. దాదాపు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు తెలిసిన వారికి ఈమె ఎవరో ఠక్కున చెప్పేస్తారు. బ్యాంకాక్ వింతలు, విశేషాలు చెప్తూ అనేక వీడియోలు చేసింది. ఇప్పటికే యూట్యూబ్ లో కూడా అనేక అవార్డులు అందుకుంది. కొత్తగా బ్యాంకాక్ కు వెళ్లే వారి కోసం ఎయిర్ పోర్టులో దిగినప్పటి నుంచి వారు చూడాల్సిన ప్రదేశాల వరకు వీడియోలతో ముందుంచుతుంది.
శ్రావణి సమంతపూడి పుట్టినిల్లు విజయనగరం. అందుకే బిగ్ బాస్ 7లోకి తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.శ్రావణి కుటుంబంతో సహా ఇండియాకూ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసింది. త్వరలో ప్రారంభం కానున్న షోలో పాల్గొనేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది బిగ్ బాస్ తెలుగు 6లో చూస్తే హౌజ్ లో 21 మంది ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి 25 మందిని తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో ఒక డైవర్స్ జంట కూడా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కొందరి పేర్లు కాంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి. సీరియల్ యాక్టర్స్, యాంకర్స్, యూట్యూబర్స్, సింగర్స్, కమెడియన్స్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 6 చాలా మేరకు విమర్శలు అందుకుంది. ఈ సారి వాటన్నింటినీ సరిచేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హోస్ట్ విషయంలోనూ పలువురు స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిపైనా మున్ముందు అప్డేట్స్ అందాల్సి ఉంది.