Mobile Banking Services :
ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ప్రతీది ఆన్ లైన్ లోనే చేసుకుంటున్నాం. ఇక మీదట బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. కాలానుగుణంగా మనం మారాలి కదా. అందుకే ఇంటి నుంచే అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే డిజిటల్ ఫీచర్స్ త ముందుకు వస్తున్నాం. తాజాగా ఎస్బీఐ వాట్సాప్ ద్వారా సర్వీసులు అందించేందుకు సమాయత్తమైంది. ఇందుకనుగుణంగానే బ్యాంకులు కూడా రెడీ అవుతున్నాయి. వినియోగదారులకు ఇంటి నుంచి సమాచారం చేరవేసే ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి బ్యాంకుకు రావడం పెద్ద పనిగా మారింది.
వాట్సాప్ లలో సందేశాల రూపంలో కనెక్ట్ చేస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా షేర్ చేస్తున్నారు. దీంతో ఇక మీదట బ్యాంకుకు వెళ్లాల్సి పనిలేదు. వినియోగదారులకు సేవల రూపంలో భారతీయ స్టేట్ బ్యాంకు ముందుకెళ్తోంది. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్ మెంట్ తీసుకోవడం వంటి పనులు వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఈ మేరకు ఆ వివరాలేంటో చూద్దాం.
ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్లో ఉన్న సమాచారం ప్రకారం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సోల్ ప్రొప్రైటర్స్ సీసీ ఓడీ అకౌంట్ హోల్డర్లు కూడా బుక్ బ్యాలెన్స్, అకౌంట్, రెన్యూవల్ డేట్, స్టాక్ స్టేట్మెంట్, ఎక్స్ పైరీ డేట్ వంటివి తెలుసుకునే అవకాశం కల్పించారు. మినీ స్టేట్ మెంట్, పెన్సన్ స్లిప్ సర్వీస్, లోన్ ఉత్పత్తులపై సమాచారం రాబట్టుకోవచ్చు. గృహరుణం, కారు లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ గురించి వడ్డీ రేట్లు తెలుసుకోవచ్చు.
రికరింగ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు సమాచారం అందుతుంది. ఎన్ఆర్ఐ సేవలు ఫీచర్ల, వడ్డీ రేట్లు వంటి వాటిని కూడా తెలుసుకోవడం సులభం. ఇలా బ్యాంకులు మనకు అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. దీంతో బ్యాంకు సేవల్ని మనం మనకు అనుగుణంగా వాడుకోవచ్చు. ఏ సందేహం వచ్చినా ఒక ఫోన్ కాల్ తో మనకు కావాల్సిన సమాచారం క్షణాల్లో మన ముందుంటుంది.