
Basavatarakam : దేశంలో క్యాన్సర్ చికిత్సలో పేరెన్నిక గల దవాఖాన్లలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి. అక్కడ ఎంతో మంది పేదలు, ప్రముఖులు వైద్య చికిత్స తీసుకుంటుంటారు. అత్యంత ఖరీదైన వైద్యాన్ని పేదలకు తక్కువ ధఱలో అందిస్తూ అగ్రశ్రేణి దవాఖాన్లలో ఒకటిగా నిలిచింది. సేవల్లో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధిస్తూ ముందుకెళ్తున్నది. అయితే తాజాగా బసవతారకం క్యాన్సర్ హస్పిటల్ దేశంలోనే క్యాన్సర్ చికిత్సలో రెండో స్థానంలో నిలిచింది.
బసవతారకం క్యాన్సర్ చికిత్సాలయం దేశంలోనే అత్యుత్తమ సేవలతో ముందుకెళ్తున్నది. తాజాగా ఔట్ లుక్ అనే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో దేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ చికిత్స అందిస్తున్న హస్పిటళ్లలో రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ర్టలోని ముంబైలో రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన మొదటి స్థానంలో నిలిచింది. బసవతారకం క్యాన్సర్ హస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ నిత్యం ఇక్కడ అధునాతన సేవల కోసం తపిస్తుంటారనే పేరుంది. ఆయన ఆధ్వర్యంలోనే ఎంతో మంది వైద్యులు ఇక్కడ విలువైన సేవలు అందిస్తుంటారు. అవసరమైన ఎక్విప్ మెంట్ ను అందుబాటులో ఉంచుతూ ప్రపంచ దేశాలకు దీటుగా ఇక్కడ చికిత్స అందిస్తారనే పేరుంది. తన తల్లి పేరిట, మహోన్నత ఆశయంతో ఆయన ఈ దవాఖానను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు పలువురు ఈ దవాఖాన కార్యకలపాల్లో భాగస్వాములై పాలుపంచుకుంటున్నారు. అయితే పేదింటి బిడ్డలకు అతి తక్కువ ధరతో సేవలు అందిస్తుండడంతో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
అయితే బసవతారకం క్యాన్సర్ వైద్యశాల దేశంలోనే నంబర్ 2 స్థానాన్ని సంపాదించడంపై పలువురు ప్రముఖుులు ప్రత్యేకంగా చైర్మన్ తో పాటు సిబ్బందిని అభినందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. బాలకృష్ణ కృషి, పట్టుదల, అక్కడి సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవమని కొనియాడారు.