Basavatharakam Cancer Hospital : హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 23 వార్షికోత్సవ వేడుకలు గురువారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సేవా దృక్ఫథంతో ఎందరికో అతి తక్కువ ఖర్చులతో క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్న దవాఖానగా బసవతారకం ప్రసిద్ధి సాధించింది. సినీనటుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ దవాఖాన ఎన్నో ప్రశంసలు అందుకుంది. తన సేవలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇండియాలోనే టాప్ టెన్ క్యాన్సర్ దవాఖానల్లో పేరు సంపాదించుకొని అత్యాధునిక సేవలందిస్తున్నది.
23 వార్షికోత్సవ వేడుకలకు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హాజరయ్యారు. ఆమెను ఈ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా సినీ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ సీనియర్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ ప్రణవి చంద్ర ను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ సన్మానించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సంస్థ సాధించిన విజయాలు, అందిస్తున్న సేవలపై మాట్లాడారు. తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. తెలుగు జాతికి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన జీవితం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దవాఖానలో వైద్యుల సేవలను కొనియాడారు. జీవితంలో ముందుకెళ్లాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలని ఈ సందర్భంగా క్యాన్సర్ బాధితులకు సూచించారు. మైండ్ సెట్ బలంగా ఉంచుకోవాలని కోరారు. ఈ దవాఖాన ఉన్నతిలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ దవాఖాన ఉన్నతిలో సహకరిస్తున్న క్యాన్సర్ కు ఖరీదైన వైద్యం అవసరమైన సమయంలో అతి తక్కువ ఖర్చులతో సేవలందిస్తున్న బసవతారకం హాస్పిటల్ సేవలను వక్తలు, అతిథులు అభినందించారు.