Big Boss 7 Telugu :
బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అవ్వడమే కాకుండా అప్పుడే రెండు వారాలు కూడా పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 3న స్టార్ట్ అయిన ఈ సీజన్ ఈసారి మరిన్ని ట్విస్టులతో ఆద్యంతం అలరించేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మొదట్లో ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ రోజురోజుకూ బోర్ గా మారిపోతుంది.. కంటెస్టెంట్స్ సరిగ్గా ఎంటెర్టైనమెంట్ ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గత రెండు సీజన్స్ లలో బిగ్ బాస్ అలరించలేక పోవడంతో ఈసారి కొత్తగా స్టార్ట్ చేసారు. అయినా కూడా కొద్దిగా నెగిటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ లో తాజాగా సెప్టెంబర్ 20వ ఎపిసోడ్ లో జరిగిన హైలెట్స్ ఇవే.. ఏది ఏమైనా అప్పుడే బిగ్ బాస్ మూడవ వారంలోకి కూడా ఎంటర్ అయ్యి నామినేషన్స్ కూడా ముగిసాయి..
శుభ శ్రీ, దామిని, గౌతమ్, యావర్, ప్రియాంక, రతికా, అమర్ దీప్ లు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రా ఉండడంతో ఇంటి సభ్యులుగా అర్హత సాధించుకున్నారు.. ఈ వారం పవర్ అస్త్రా కోసం పోటీ జరుగుతుంది. యావర్ ఎట్టకేలకు తాను అర్హుడు అని నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు శోభా శెట్టి వంతు వచ్చింది.
అత్యంత కారంగా ఉన్న చికెన్ ను తినే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. దీంతో ఈమె ఆ చికెన్ తినగానే చుక్కలు కనిపించాయి.. అక్కడే కన్ఫెక్షన్ రూమ్ లో ఏడ్చేసింది. నోట్లో టిష్యు పేపర్స్ ను పెట్టుకుని కంట్రోల్ చేసుకుంది. ఇక ఈమె కంటెండర్ గా అనర్హురాలు అని చెప్పిన బిగ్ బాస్ శుభ శ్రీ, ప్రశాంత్, గౌతమ్ లను రూమ్ లోకి పంపి చికెన్ మొత్తం ముందుగా ఎవరు తింటే వారు కంటెండర్ అవుతారని చెప్పారు.. ఇక్కడితో ఈ ప్రోమో ముగిసింది.