
BC Bandhu : దళితలకు ‘దళిత బంధు’ ద్వారా రూ. 10 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం.. కొద్ది మందికి ఇచ్చి మిగతా వారిని అసంతృప్తికి గురి చేసింది. తాము ఉంటేనే ఈ పథకాలు నడుస్తాయని లేదంటే నడవని కూడా ప్రచారాన్ని ప్రారంభించింది. వారి ఓట్లను ఎటూ పోనివ్వకుండా లాక్ వేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ‘దళిత బంధు’ను దళితులు నమ్ముతారో లేదో తెలియదు. కానీ మాకేంటి అని బీసీ వర్గాలు అసంతృప్తికి గురవుతున్నాయి. దీంతో వారిని కూడా ప్రసన్నతం చేసుకునేందుకు ‘బీసీ బంధు’ తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చిరు వ్యాపారులు, కుల వృత్తులు చేసుకునే వారికి కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి సబ్సిడీతో ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రూ. 10 లక్షలు ఇస్తారా..? లేకపోతే తక్కువ ఇస్తారా..? ఎక్కువ ఇస్తారా..? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఇవ్వడం మాత్రం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దళితులపై దృష్టి పెట్టి బీసీ వర్గాలను దూరం చేసుకుంటున్నారన్న అపవాదు పెరుగుతుండడంతో ఈ పథకానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గొర్రెల పంపిణీ రెండో విడుత జరగకపోవడం నుంచి అనేక పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. వారితో బీసీ, ఇతర వర్గాలు అసంతృప్తిలో ఉన్నరని బహిరంగంగానే వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి రైతు బంధు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆయన రెండో సారి సీఎం అయ్యారు. ఇక హ్యాట్రిక్ సాధించాలంటే ఏదైనా ట్రిక్ ప్లే చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత తేలికయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఈ సారి మరిన్ని కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు కేసీఆర్. ఇలా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి పథకాలు రూపొందించడం వల్ల మిగిలిన వర్గాల ఓట్లు రావని, వారు అసంతృప్తికి గురవుతున్నారని తెలుస్తోంది. వారిని సంతృప్తి పరిచేందుకు మరో పథకం పెడుతున్నారు. నిజానికి కేసీఆర్ పెట్టే పథకాలన్నీ ప్రజలకు చేరవని.. ఓ 10 మందికి ఇచ్చి ఆశ చూపించి ఓట్లు పొందుతారని.. తర్వాత వదిలేస్తారని టాక్ వినిపిస్తోంది. దానికి దళిత బంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లే సాక్ష్యమనే ఆరోపణలు ఉన్నాయి.






