
Be careful in summer : కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండ తీవ్ర బాగా పెరిగింది. అడుగుబయట పెడితే వడగాలులతో తీవ్ర వడదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉంది. దీంతో స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ శాఖలు సోషల్ మీడియా మాధ్యమంగా అలెర్ట్ చేస్తున్నాయి. ఇటీవల తెలంగా పోలీస్ శాఖ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రజలకు తగు సూచనలు చేసింది. వడదెబ్బకు గురికావద్దని హెచ్చరించింది.
రెండు, మూడు రోజులుగా ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. బయటకు వెళ్లాల్సిన పనులను ఉదయం, లేదా సాయంత్రానికి వాయిదా వేసుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వేడి తీవ్రత క్రమంగా పెరుగుతూ 10 గంటల వరకూ విపరీతం అవుతుంది. ఇక సాయంత్రం వేళ వేడి అలాగే ఉన్నా.. దాదాపు రాత్రి 7గంటల తర్వాత వాతావరణం కొంచెం చల్లబడుతుంది. ఇక అప్పుడు బయట వెళ్తున్నారు. కూలర్లు, ఏసీలతో కాలం వెళ్లదీస్తున్నారు ప్రజలు.
అయితే తెలంగాణ పోలీస్ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నందున బయటకు రావద్దని సూచిస్తున్నారు. బాడీ డీహైడ్రేషన్ కాకుండా విరివిగా నీరు, నిమ్మరసం, మజ్జిక తాగాలని చెప్తున్నారు. చిన్నారులు ఆటలో పడి నీటిని తాగడం మానేస్తారని, తల్లిదండ్రులు ప్రతీ గంటకు కొంచెం కొంచెం నీటిని తాగించాలని సూచించారు. ఆరుబయట ఆడకుండా చూసుకోవాలన్నారు. చెట్లు, నీడ పట్టున ఆడినా ఎండ వేడికి డీ హైడ్రేషన్ కు గురయ్యే ఛాన్స్ ఉంది. ఆరుబయట పని చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండకు ఎటువంటి అనారోగ్యానికి గురైనా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.