
sun is burning : ఎండలు ముదిరాయి. భానుడు భగభగ మండుతున్నాడు. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వేడి ప్రభావంతో ఎండదెబ్బ తగిలే అవకాశాలున్నాయి. అందకే ఎండ బారి నుంచి రక్షించుకోవడానికి పలు చర్యలు తీసుకోవాలి. వేసవి కాలం కావడంతో సాధారణంగా ఎండల ప్రభావం అధికంగా ఉండటం కామనే.
ఎండాకాలంలో పప్పులు, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు లాంటి వాటికి దూరంగా ఉండాలి. కొబ్బరిబొండాం, చెరుకు రసం, మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీంతో ఆరోగ్యం బాగుంటుంది. వడదెబ్బ ముప్పు నుంచి రక్షించుకోవచ్చు. ఇంకా నిమ్మరసం తీసుకోవడం వల్ల కూడా మనకు ఎండదెబ్బ తగిలే అవకాశం ఉండదు.
త్వరగా జీర్ణమయ్యే వాటిని తీసుకోవడం ఉత్తమం. నీరు అధికంగా ఉండే సొరకాయ, దోసకాయ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. అధిక ప్రొటీన్లు, ఉప్పు, కారం ఉండే పదార్థాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. మసాలాలు, ఎక్కువ నూనెలు ఉండే పచ్చళ్లను తినకపోవడమే బెటర్.
ఎండలో తిరగకపోవడమే ఉత్తమం. అత్యవసరమనిపిస్తే బయటకు వెళ్లేటప్పుడు తెల్ల గుడ్డ నెత్తికి కట్టుకోవాలి. వెంట నీళ్ల బాటిల్ ఉంచుకోవాలి. అందులో నిమ్మరసం కలుపుకుంటే ఇంకా మంచిది. ఇలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ బారి నుంచి రక్షించుకోవాలి.