Ias Ips : పెళ్లి చేసుకోవాలంటే ఈ రోజుల్లో ఎంతో హడావిడి చేస్తుంటారు. డబ్బు లేని వాళ్లే పెళ్లి ఘనంగా చేసుకుంటున్నారు. ఆకాశమంత పందిరి వేసి ఊరంతా తోరణాలు కట్టి వివాహ తంతును ఎంతో వైభవంగా చేసుకుంటున్నారు. అసలు తగ్గేదేలే అని అంటున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకునే వివాహం విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. కానీ కొందరు ఆదర్శవంతులు మాత్రం సాధారణంగా చేసుకోవడం సహజమే.
తాజాగా క్రిష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన వివాహం అందరిలో ఆశ్చర్యాన్ని నింపింది. ఇద్దరు సివిల్స్ అధికారులే. కానీ వారి ఆలోచనలు మాత్రం సింపుల్ గా ఉండటం గర్వకారణమే. ప్రస్తుతం డబ్బు లేని వారే ఎంతో హుందాగా చేసుకుంటున్న తరుణంలో వీరు మాత్రం అత్యంత సాధారణంగా వివాహం చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు.
క్రిష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి దేవేంద్ర కుమార్ కలెక్టరేట్ లోని చాంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వివాహ వేడుక ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనది. కానీ వీరు మాత్రం ఆ వేడుకను ట్రెండ్ కు తగినట్లుగా కాకుండా ట్రెడిషనల్ గా వివాహం చేసుకోవడంతో అందరు అవాక్కయ్యారు.
అత్యంత నిరాడంబరంగా జరిగిన వారి పెళ్లిని చూసిన వారందరు ముక్కు మీద వేలేసుకున్నారు. ఏమి లేని వారే ఎంతో ఆర్భాటంగా చేసుకునే పెళ్లిని ఇంత పెద్ద హోదాలో ఉన్న వారు సింపుల్ గా చేసుకోవడం వెనుక కారణాలు ఏముంటాయని ఆలోచించారు. వారి నిరాడంబరానికి అందరు ఫిదా అయ్యారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే పెళ్లి తంతు సాధారణంగా చేసుకోవడం వారి ఆదర్శానికి ప్రతీకగా ప్రశంసించారు.